ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్
రాష్ట్రం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులోని ఆనంద్‌నగర్ కాలనీలో కౌన్సిలర్లు ఈశ్వర్‌రాజు, వెంకట్రాంరెడ్డి, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
షాద్‌నగర్‌రూరల్, మే 5 : రాష్ట్రం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులోని ఆనంద్‌నగర్ కాలనీలో కౌన్సిలర్లు ఈశ్వర్‌రాజు, వెంకట్రాంరెడ్డి, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ను మరోసారి నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో శేఖర్, రాఘవేందర్‌గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : మున్సిపాలిటీలోని 1,11,12,13,14,15వ వార్డుల్లో ఆదివారం వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలుపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ చూడని కరువును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మాయ మాటలను నమ్మి మరోసారి మోసపొవద్దని, బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈశ్వర్‌రాజు, ప్రతాప్‌రెడ్డి, అంతయ్య, బచ్చలి నర్సింహ, నందీశ్వర్, వెంకట్రాంరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు గౌస్జానీ, నాయకులు జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, చెట్ల నర్సింలు, యాదగిరి, రాఘవేందర్, సాధిక్, అశోక్, రాజశేఖర్, రఘు, మహిమూద్, సుశాంక్, రాఘవేందర్, పాండు, శరత్కృష్ణ పాల్గొన్నారు.
కొత్తూరు : కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, బాతుక దేవేందర్‌యాదవ్ అన్నారు. కొత్తూరు మునిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎండలను సైతం లేక్క చేయకుండా ప్రజల నుంచి అనూహ్వ స్పందన వస్తుందన్నారు.
ప్రచారంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, పెంటనోళ్ల యాదగిరి, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, సోమ్లానాయక్, నాయకులు గోపాల్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్,మాజీ సర్పంచ్‌లు బ్యాగరి సత్తయ్య, బాల్‌రాజ్, రాజ్యలక్ష్మి, దేశాల జైపాల్, జంగగళ్ల శివకుమార్, దామోదర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, దేశాల భీమయ్య, పంపుల నరసింహాగౌడ్, రవినాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

