సీనియర్ దర్శకుడు పీఎన్ రామచంద్రరావు కొంత విరామం తర్వాత స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘పహల్గాం లవ్‌స్టోరీ’. కృష్ణమోహన్, చిత్రశుక్ల జంటగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 21న థియేట్రికల్ రిలీజ్ కానున్నది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
జమ్ము కాశ్మీర్‌లోని అందమైన, అరుదైన లొకేషన్స్‌లో సినిమాను తెరకెక్కించామని, ఇది కేవలం వినోదం కోసమే తీసిన సినిమా కాదని, దేశభక్తిని మేల్కొలిపే జాతీయ సమస్యను ఇందులో చూపిస్తున్నామని దర్శకనిర్మాత పీఎన్ రామచంద్రరావు తెలిపారు. సుమన్, పూజా బిస్త్, జయప్రకాశ్ నారాయణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం: గాయత్రి కళాచిత్ర.