ధారూరు, మే19 : విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా ఐటిఐ కళాశాల పని చేయలని, ఉద్యోగ భద్రతే లక్ష్యంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కోండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఐటిఐ కళాశాలను వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, నాయకులతో కలిసి యూనియన్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ జయంత్ చౌదరి ఆదేశాల మేరకు పరిశీలించారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ పట్టణంలోని ఐటిఐ కళాశాల కేంద్రంలో వసతుల కోసం తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, నాయకులు శ్రీధర్ రెడ్డి, నరోత్తంరెడ్డి, శిరీష, వెంకట్, శివరాజ్, గొడుగు సుధాకర్, రాఘవేందర్, శ్రీనివాస్, విజయ్‌కుమార్, వినయ్, తదితరులు ఉన్నారు.