నవాబుపేట, జనవరి 24 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దాతాపూర్, ముబారక్పూర్, గుల్లగూడ, నరేగూడ గ్రామ పంచాయతీల నూతన భవనాలను బుధవారం స్థానిక ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుజేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధిపొందిందన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే యాదయ్య నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రామాల్లో అనేక సౌకర్యాలను కల్పించారని, సొంత భవనం లేని పంచాయతీలకు నూతనంగా నిర్మించుకోవడానికి నిధులు కేటాయించారని తెలిపారు. మండలంలోని చించల్‌పేట, ముభారక్‌పూర్ గ్రామాల్లో మూసి వాగుపై రెండు బ్రిడ్జిలను నిర్మించి ప్రజల కష్టాలను దూరం చేశామన్నారు. గంగ్యాడలో రైతుల సౌకర్యార్థం మూడు కాలాలు పంటలు పండించుకోవడానికి మూసీపై చెక్‌డ్యామ్ నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతనే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి పంచాయతీలో సొంత భవనం ఉందని, రైతులు తమ సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకునేందుకు రైతువేదికలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
అనంతరం అక్నాపూర్‌లో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు బాలమణి, విమల, పర్మయ్య, శ్రీనివాస్ గౌడ్, బల్వంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీటీసీ పద్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌రెడ్డి, ముకుంద్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.