Ram Pothineni | వరుస ఫ్లాపులతో రామ్ పోతినేని సంక్షోభం.. స్వయంగా కథ రాయాలని డిసైడ్ అయ్యాడా..!
Ram Pothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్ ప్రస్తుతం కాస్త సంక్లిష్ట దశలో కొనసాగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఈ చిత్రానికి పూర్తిగా నెగటివ్ టాక్ రాకపోయినా, థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం కమర్షియల్ పరంగా ప్రభావం చూపింది.
Ram Pothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్ ప్రస్తుతం కాస్త సంక్లిష్ట దశలో కొనసాగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఈ చిత్రానికి పూర్తిగా నెగటివ్ టాక్ రాకపోయినా, థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం కమర్షియల్ పరంగా ప్రభావం చూపింది. మంచి స్పందన వచ్చినా కలెక్షన్లలో మాత్రం సినిమా వెనుకబడింది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్‌కు సరైన బ్లాక్‌బస్టర్ దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వరుస అపజయాలతో రామ్ ఇప్పుడు తన కెరీర్‌పై మరోసారి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కొంతకాలం గ్యాప్ తీసుకుని కొత్త ప్రాజెక్ట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రామ్ కేవలం నటుడే కాకుండా మంచి రచయిత కూడా. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో ఉన్న ‘నువ్వుంటే చాల్లే’ అనే పాటను ఆయనే రాసిన విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ అనుభవంతో ఇప్పుడు తన తదుపరి సినిమా కథను కూడా స్వయంగా రాయాలని రామ్ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీనికోసం రామ్ విదేశీ విహారయాత్రకు వెళ్లి అక్కడే సుమారు మూడు నెలలు గడుపుతూ కథపై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. జూన్ లేదా జూలైలో కొత్త సినిమా ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించే అవకాశముందని సమాచారం. వరుస ఫ్లాపుల తర్వాత స్వయంగా కథ రాసుకుని రామ్ కొత్త ప్రయోగానికి సిద్ధమవ్వడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి సరైన కథ, సరైన టీమ్‌తో రామ్ మళ్లీ విజయపథంలోకి వస్తాడా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

