Ravi Teja | సంక్రాంతి హిట్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్‌పై ఆసక్తి
Ravi Teja | సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది టాలీవుడ్లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేశాయి. ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
Ravi Teja | సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది టాలీవుడ్లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేశాయి. ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతి సీజన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న ఈ సినిమాల్లో ఎక్కువ భాగం విజయాన్ని అందుకోవడంతో థియేటర్లలో మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సంక్రాంతి చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలోకి అడుగుపెడుతున్నాయి.
ఇప్పటికే ప్రభాస్, శర్వానంద్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి రాగా, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాల అధికారిక స్ట్రీమింగ్ తేదీలు కూడా ప్రకటించబడ్డాయి. అయితే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఓటీటీ విడుదలపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లు సాధించింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అందుకే అధికారిక స్ట్రీమింగ్ డేట్ కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలా స్పందన పొందుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

