కొడంగల్, జనవరి 13 : భారతీయ సంస్కృతికి అద్దం పట్టే లా రంగు రంగుల రంగవళ్లి చాటి చెబుతున్నదని ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం సంక్రాంతి సంబురాల్లో భాగంగా స్థానిక మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన రంగవల్లి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నది. మండలంలోని చిన్ననంది గ్రామ స్టేజీ వద్ద విజయ్ కాటన్ మిల్ నేతృత్వంలో మహిళలకు రంగవల్లి పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పండుగను సూచించేలా వివిధ ఆకృతులు, ఆకర్శించే రంగులతో మహిళలు ఉత్సాహంగా ముగ్గులను వేశా రు.
పోటీల్లో 23మ ంది పాల్గొన్నారు. సీనియర్ ఆర్టిస్టులు, ఉపాధ్యాయులు బసవలింగప్ప, చంద్రప్ప, వెంకట్ ముగ్గుల పోటీలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు. విజేతలకు ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్‌తో పాటు విజయ్ కాటన్‌మిల్ సభ్యులు, పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆ లయ అర్చకులు రామస్వామి, పండితులు శ్రీనివాసాచార్యు లు, గోపాల్, మురారి వశిష్ట, బాలప్రకాశ్, ఆలయ ధర్మకర్తలు శ్రీనివాస్, రత్నం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట : మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో సం క్రాంతి పండుగ సందర్భంగా శనివారం నిర్వహించిన మండలస్థాయి కబడ్డీ పోటీల్లో బురాన్పూర్తండా విజేతగా నిలిచింది. పోటీలకు మండలంలోని గ్రామాల నుంచి 12 జట్లు పాల్గొనగా ఫైనల్ పోరులో నాందార్‌పూర్, బురాన్పూర్తండా జట్లు తలపడ్డాయి. విజేతగా నిలిచిన బురాన్పూర్తండా జట్టుకు రూ.8 వేలు, నాందార్‌పూర్ జట్టుకు రూ.4 వేల నగదు బహుమతి గ్రామానికి చెందిన యువకులు అం దజేశారు. ఆది, సోమవారాల్లో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీ లు నిర్వహిస్తామని, ఇప్పటివరకు 24 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. వాలీబాల్ పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
పెద్దేముల్ : మండల పరిధిలోని గాజీపూర్ గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ అంబురామేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గ్రామంలోని మహిళలు, యువతులు పాల్గొని ముగ్గులు వే శారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏకలవ్య ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ బాలకృష్ణ, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరప్ప, ఎంపీటీసీ వెంకటేశ్‌చారి, డైరెక్టర్లు బిచ్చన్న, గుండప్ప, సీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.