ఆమనగల్లు, మే 20 : ఆమనగల్లు పట్టణంలోని మాడుగుల రహదారిలో గల బీసీ వసతి గృహాన్ని అతి త్వరలోనే నూతన భవనాన్ని నిర్మించి బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామాని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వారు అన్నారు. మంగళవారం శిథిలావస్థలో ఉన్న భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు వినతిమేరకు స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యేలు శిథిలావస్థలో ఉన్న భవనాన్ని సందర్శించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో మాట్లాడగా వెంటనే బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేశవ్రామ్ను పంపించారు.
ప్రస్తుతం బీసీ వసతి గృహనికి 21 గుంటల స్థలం ఉన్నదని బీసీ గురుకుల భవనం, బీసీ వసతిగృహ నిర్మాణానికి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు వెంటనే మంజూరు చేయిస్తామాని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పీసీబీ సభ్యుడు ఠాగూర్ బాలాజీసింగ్, తహసీల్దార్ లలిత, మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు, పార్లమెంట్ ఇంచార్జీ మధుసూధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వస్పుల మానయ్య, మాజీ మండల అధ్యక్షుడు మండ్లీ రాములు, కేఎన్ఆర్ సేవా దళం అధ్యక్షుడు మెకానిక్ బాబా, నాయకులు శ్రీనునాయక్, మహేష్, ఫరీద్ తదితరులు ఉన్నారు.