ఆమనగల్లు, ఏప్రిల్ 20 : ప్రాంతీయ పార్టీలతోనే రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగర్‌కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు ఎకరాకు ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు అందించలేకపోయారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. సీఎం పిట్టల దొరలా పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆగస్టు 15వరకు రుణమాఫీ చేస్తానంటూ మరోసారి రైతులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుందని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు , రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
గతంలో పనిచేసిన ప్రధానమంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి దేశానికి సంబంధించిన సమాచారం చెప్పేవారన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ 10 ఏండ్లుగా ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టలేదన్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తన కుమారుడు భరత్ప్రసాద్కు బీజేపీ ఎంపీ సీటు ఇవ్వడంతో పార్టీ మారారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్న పదవిని వదులుకుని రాజకీయాలకు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కావాలో.. పరిజ్ఙానం లేని భరత్‌ప్రసాద్ కావాలో ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని అన్నారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంత బిడ్డగా మీ ముందుకు వచ్చానని తనకు ఓటువేసి ఆశీర్వదిస్తే అండగా ఉంటానన్నారు. గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఎంతో మంది పేద విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేశానన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరితే టీఎస్పీఎస్సీ పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి పిలిచారన్నారు. తాను ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ అందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి చాడ కిషన్‌రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి రంగినేని అభిలాశ్‌రావు,
గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, జడ్పీటీసీలు నేనావత్ అనురాధ, దశరథ్‌నాయక్, విజితారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్‌యాదవ్, వైస్ ఎంపీపీలు ఆనంద్, శంకర్, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎల్ఎన్ రెడ్డి, ఎంపీటీసీలు కుమార్, గ్యార వెంకటయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొనుగోటి అర్జున్‌రావు, ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, శంకర్, విజయ్‌గౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోగు వీరయ్య, కొమ్ము శ్రీనివాస్ యాదవ్, బండగల్ల చందు, నాయకులు సురమల్ల సుభాశ్, జంతుక అల్లాజీ, కొమ్ము ప్రసాద్, డేరంగుల వెంకటేశ్, చలిచీమల సతీశ్, రమేశ్‌నాయక్, భాస్కర్, పోలే మహేశ్ తదితరులు పాల్గొన్నారు.