తెలంగాణ కోసం పనిచేసేది బీఆర్ఎస్సే..
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి లాభంలేదని బీఆర్ఎస్ మాత్రమే ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుందని బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి కొత్తూరు మండల ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని కొత్తూరు పాప్రస్ పోర్టులో ఆదివారం నిర్వహించారు.
- జాతీయ పార్టీలతో ఏం లాభంలేదు
- 10 ఏండ్ల సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి
- బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపిస్తారు
- మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి
- కొత్తూరు పాప్రస్ పోర్టులో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం
కొత్తూరు, ఏప్రిల్ 14 : జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి లాభంలేదని బీఆర్ఎస్ మాత్రమే ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుందని బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి కొత్తూరు మండల ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని కొత్తూరు పాప్రస్ పోర్టులో ఆదివారం నిర్వహించారు. దీనికి ఎంపీ అభ్యర్థితోపాటు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిచిన తర్వాత షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎంతోమందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు.
కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని.. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయని.. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులతోపాటు అన్ని వర్గాల వారు ఇబ్బందిపడుతున్నారన్నారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆరోపించారు. మరోసారి తనను ఆశీర్వదించి.. గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.
గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తేనే పార్టీకి.. క్యాడర్‌కు బంగారు భవిష్యత్ ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ వాణి పార్లమెంట్లో వినిపిస్తారన్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఇతర ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామిలిచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను పథకాల అమలుపై నిలదీయాలని సూచించారు. గతంలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని.. మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని.. ప్రభుత్వాన్ని నడపడం వారికి చేతకావడంలేదని విమర్శించారు. రూ.7,500 కోట్లను రైతు బంధు కోసం కేసీఆర్ ట్రెజరీల్లో జమచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పంచిపెట్టిందని ఆరోపించారు. మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ నియోజవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. కార్యకర్తలు నెల రోజులపాటు అలుపెరుగకుండా ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించాలని ఆయన సూచించారు. సమావేశంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, జడ్పీటీసీ శ్రీలత, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కొత్తూరు, నందిగామ మండలాల అధ్యక్షులు కృష్ణయాదవ్, పద్మారావు, నాయకులు దేవేందర్‌యాదవ్, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, విఠల్, నారాయణరెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

