బడుగుల గొంతుక కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిద్దామని బీసీ సంఘాలు పిలుపునిస్తున్నాయి. రాజకీయాలకతీతంగా బీసీలు ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా.. లోక్‌సభ ఎన్నికల్లో తిప్పికొడతామని స్పష్టం చేస్తున్నారు. బీసీల ఓట్లు లేనిదే ఏ పార్టీకీ మనుగడ ఉండదన్న విషయాన్ని ఈ ఎన్నికల్లో రుజువు చేసి చూపించాలని నేతలు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా బడుగులను అవహేళన చేస్తున్న రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు. బీసీల శక్తిని, చైతన్యాన్ని ప్రదర్శించి ఆయా పార్టీల నేతల నోళ్లను మూయించాలని చెబుతున్నారు. బీసీల కోసం పోరాడే వ్యక్తులే కరువయ్యారని.. ఈ పరిస్థితుల్లో బీసీల హక్కుల కోసం పోరాడేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)
చేవెళ్ల ఎంపీగా బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఆరు పార్లమెంట్ సీట్లు కేటాయించడం సంతోషకరం. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్.. బడుగు, బలహీన వర్గాల నేతకు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని బీసీ సోదరులంతా సద్వినియోగం చేసుకొని కాసానిని గెలిపించి పార్లమెంట్‌కు పంపిద్దాం.
– మంగళి కరుణాకర్, కక్కులూర్, షాబాద్ మండలం
చేవెళ్ల గడ్డపై ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల సత్తా చాటాలి. బీసీలంతా ఐకమత్యంగా ఉండి, కాసాని గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి. మన సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న జ్ఞానేశ్వర్‌ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాటం చేస్తారు.
– దయాకర్‌చారి, దామర్లపల్లి, షాబాద్ మండలం
ఉమ్మడి జిల్లా అభ్యున్నతికి ఎంతో కృషిచేసి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. కాసాని లాంటి నాయకుడు పార్లమెంట్‌లోకి వెళ్లే నిరుపేదలు అభివృద్ధి చెందుతారు. బీసీలందరూ కలిసికట్టుగా కాసాని జ్ఞానేశ్వర్ వెంటే ఉండాలి. బీసీ నాయకుడిని గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇస్తాం.
– ఎం.కిష్టయ్య అంగడిచిట్టంపల్లి, పూడూరు మండలం
బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ సామాజిక వర్గానికి మొండిచేయి చూపగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన కాసానికి టికెట్ ఇచ్చారు. కాసాని గతంలో ఉమ్మడి రంగారెడ్డిలో అనేక హోదాల్లో బీసీ వర్గాలకు చెందిన నాయకులను చైతన్యపర్చారు. బీసీ మేధావులు, విద్యావంతులు, యువకులు బీసీ అభ్యర్థిని గెలిపించి మన ఐక్యతను చాటాలి.
– జావిద్, మన్నెగూడ, పూడూరు మండలం
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొదటి నుంచి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనేక మంది బీసీలకు బీఆర్ఎస్ చేయూతనందించింది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు టికెట్‌ను కేటాయించి బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపింది. బీసీలంతా రాజకీయాలకతీతంగా కాసానిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– మల్లేశ్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, మణికొండ
బీసీలను తక్కువ చేసి మాట్లాడిన మోహన్రెడ్డిలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ బీసీల్లో ఐక్యత లోపించింది నిజమే.. ఇకనైనా రాజకీయాలను పక్కనబెట్టి చేవెళ్ల గడ్డపై బరిలో ఉన్న కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుని సత్తా చాటుదాం. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటువేసి మన ఐక్యతను చాటిచెప్పాలి. అగ్రకులాల నేతలు మనందరినీ ఓటు రాజకీయాలకు బలిపశువుల్లా వాడుకుంటున్నారు.
– కొణతం లక్ష్మణ్‌గౌడ్, ఎండీ, కేఎల్ ఇన్ఫ్రా, మణికొండ
96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహా నేత జ్ఞానేశ్వర్. ఈ ఎన్నికల్లో బీసీలందరం ఏకమై పార్టీలకతీతంగా బీసీ బిడ్డను గెలిపించుకోవాలి. అందుకు కారు గుర్తుకు ఓటు వేసి బీసీల శక్తి, చైతన్యం నిరూపించుకోవాలి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పార్టీలు మారే నేతలకు మనం ఓటు వేయొద్దు.
– రాంచందర్, తాండూరు
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను కేసీఆర్ ప్రతిపాదించిన సందర్భంగా గెలిపించుకుందాం. కాంగ్రెస్, బీజేపీల రెడ్డీ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మన బీసీ ముద్దు బిడ్డను భారీ మెజార్టీతో గెలిపించుకునే తరుణం వచ్చింది. బీసీల ఓట్లతో ఇరు పార్టీల నాయకులకు తగిన గుణపాఠం నేర్పుదాం. ఓటు దెబ్బతో బీసీల ఐక్యతను చాటి మన జ్ఞానేశ్వర్ అన్నను గెలిపించి పార్లమెంట్‌కు పంపుదాం.
– కాశయ్య, బీసీ యువ రైతు, మల్లేపల్లి, దోమ మండలం
రాజకీయాలకతీతంగా బీసీలు సిద్ధమై బీసీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలి. బీసీలందరూ ఐక్యతగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలంటే ఏమిటో రుచి చూపించాలి. కాసానిని ఎంపీగా గెలిపించి పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినబడేట్లు చేయాలి.
– బుడ్డోల్ల నరేందర్‌గౌడ్, గౌడ సంఘం నాయకుడు, కందుకూరు
బీసీల ఐక్యత లేకుండా ఇతరులు కుట్రలు చేస్తుండ్రు. అన్ని కులాల కంటే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. బీసీ బిడ్డ కాసాని జానేశ్వర్ ముదిరాజ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా అనేక సేవలు చేసిండ్రు. ఆయనను గెలిపిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. కాసానిని గెలిపించి బీసీలంతా ఒక్కటేనని నిరూపిద్దాం.
– కాకి దశరథ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం నాయకుడు, కందుకూరు
నిస్వార్థంతో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి నిరంతరాయంగా పోరాడుతున్న కాసాని జ్ఞానేశ్వరన్న గెలుపు ఖాయం. స్వలాభం కోసం పార్టీలు మారి, టికెట్లు తెచ్చుకున్నంత మాత్రాన ప్రజలు ఆదరిస్తారనుకోవడం అవివేకం. తప్పుడు మాటలు, వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకులకు ప్రజలు బుద్ధిచెబుతారు.
– నరేందర్ భల్లా, చందానగర్
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఎన్నో ఏండ్లుగా ప్రజా క్షేత్రంలో ఉంటూ, బీసీల అభ్యున్నతికి పోరాటం చేస్తున్న వ్యక్తిని పార్లమెంట్‌కు పంపిద్దాం. ప్రజా సేవ చేస్తామంటూ ముసుగేసుకుని తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునే మోసగాళ్ల డిపాజిట్లు గల్లంతయ్యేలా.. జ్ఞానేశ్వరన్నను గెలిపిద్దాం.
– ప్రవీణ్, శంకర్‌నగర్, చందానగర్
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి బీసీల బలం చూపిస్తాం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలను పట్టించుకోవడంలేదు. ఎన్నో ఏండ్లుగా బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్పా.. వారికి రాజ్యాధికారం ఇవ్వడంలేదు. 96 బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి హక్కుల కోసం పోరాటం చేసిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కింది.
– నర్సింహులు, బొపునారం, బంట్వారం
అన్ని ఎన్నికల్లో ఇతర వర్గాల వారికి ఓట్లు వేసిన బీసీలు ఈసారి బీసీ అభ్యర్థికి ఓటు వేసుకునే చక్కటి అవకాశం వచ్చింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌ను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలి. పార్లమెంటులో తెలంగాణ గొంతుకను వినిపించేలా చేయాలి.
– నర్సింహులు, వికారాబాద్