తాండూరు, డిసెంబర్ 17 : తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, వికారాబాద్ జడ్పీచైర్ పర్సన్ సునీతారెడ్డి వారి కుమారుడు రినీష్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప మహాపడిపూజను వైభవంగా నిర్వహించారు.
అయ్యప్ప స్వాము ల నృత్యా లు, భక్తుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. స్వాముల శరణు ఘోషతో తాండూరు భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. తాండూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో పడిపూజలో పాల్గొని అయ్యప్ప స్వామి సేవలో తరించారు.