షాద్నగర్, మార్చి 7 : వేసవికాలం దృష్ట్యా రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యుత్ అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి విద్యుత్ సరఫరా తీరు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. రైతులు, గృహ వినియోగదారులకు కొత్త కనెక్షన్ల విషయంలో కాలయాపన చేయకుండా, మండలాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గోపయ్య, యాదయ్య, రవీందర్, మాధవరావు, వివిధ మండలాల ఏఈలు పాల్గొన్నారు.