నందిగామ,జూన్11: వీర్లపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి సొంత గ్రామం రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన సొంత గ్రామమైన వీర్లపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అదేవిధంగా నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేస్తానని అన్నారు.
అర్హులైన ప్రజలందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, ఎంపీడీఓ సుమతి, ఎంపీవో తేజ్ సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగ నర్సింహా, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, కుమారస్వామి గౌడ్, నాయకులు చిందం నర్సింహా, శేఖర్ గౌడ్, నవాజ్ రెడ్డి, అన్వర్, రవీందర్ రెడ్డి, సీతారాం, సత్యనారాయణ, ప్రభాకర్, వెంకటేశ్, ప్రభు, ప్రతాప్, రాఘవేంద్ర, నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.