షాద్‌నగర్‌టౌన్, ఆగస్టు 20: షాద్‌నగర్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మినీ స్టేడియంలో బుధవారం అభివృద్ధి పనులను నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మినీ స్టేడియాన్ని రూ. 2.75కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాల నుంచే క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలన్నారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడల్లో పాల్గొన్నడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందన్నారు.
అదే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఉన్నత పాఠశాల నుంచి 5మంది క్రీడాకారులను గుర్తించి వారికి ప్రతి నెల రూ. 5వేల చొప్పున సంవత్సరం పాటు స్కాలర్షిప్లను వ్యక్తిగతంగా ఇస్తామన్నారు. మినీ స్టేడియం అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేకు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, నాయకులు చెన్నయ్య, శ్రీకాంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, విశ్వం, బస్వం, బాల్‌రాజు, కృష్ణారెడ్డి, రఘునాయక్, శ్రీనివాస్, మంగులాల్, పురుసోత్తం, జితేందర్‌రెడ్డి, ఖదీర్, శ్రీశైలం, బాలు, నరేష్ పాల్గొన్నారు.