నందిగామ, జులై 07: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ అశోక్ ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సొసైటీ భవన నిర్మాణ పనులకు సోమవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, డిసిసిబి చైర్మన్ మామిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు సేవలందించేందుకు గతంలో ఏర్పాటు చేసిన సొసైటీలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, రైతులకు కావాల్సిన రుణాలు, ఎరువులు, విత్తనాలు అన్ని విధాలుగా తక్కువ వడ్డీతో సొసైటీల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
రైతులు ఇతర ప్రైవేటు బ్యాంకులను నమ్మకుండా సొసైటీల ద్వారా లబ్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్లు బక్కన్న యాదవ్, దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ పద్మారావు, డైరెక్టర్లు, సిఈఓ వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగ నరసింహ, మాజీ ఎంపిటిసిలు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్, చంద్రపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు కావలి కృష్ణ, జట్ట కుమార్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.