షాద్‌నగర్‌రూరల్,మే16 : మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapalli Shankar) అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని అన్నారం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి అయన హజరయ్యారు. ఈ సందర్భంగా మొదటగా గ్రామంలోని అంబేద్కర్, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు సర్కార్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తుందన్నారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లు, గృహ జ్వోతి పథకానికి రూ.2080 కోట్లు, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి రూ.732 కోట్లు ఇలా మొత్తం రూ.5,684 కోట్లు వెచ్చించిందన్నారు. మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలన్నారు. అనంతరం ఇందిరమ్మ గృహల నిర్మాణానికి అయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలో రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలను ప్రదర్శించి, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.