షాద్‌నగర్‌టౌన్, ఆగస్టు 02: షాద్‌నగర్ పట్టణ పరిశుభ్రతలో మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, నాయకులతో కలిసి యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రోజూ పట్టణాన్ని శుభ్రంగా ఉండేలా శ్రమిస్తున్న కార్మికులను అభినందించారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డును పరిశుభ్రంగా మార్చడంలో కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు.
పట్టణాన్ని శుభ్రం చేసే మున్సిపల్ కార్మికులకు ప్రజలందరూ సహకరించాలన్నారు. అదే విధంగా మున్సిపాలిటీలోని 9వ వార్డు మల్లికార్జునకాలనీ పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పార్కుల అభివృద్ధితో కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో విద్యుత్ సమస్యల పరిష్కరించేందుకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, నాయకులు చెన్నయ్య, బస్వం, ముబారక్, ఇబ్రహీం, శ్రీనివాస్, రఘు, శ్రీశైలం, సీతారామ్, అర్జున్లక్ష్మణ్, అందె మోహన్, రాజేశ్ పాల్గొన్నారు.