షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 25: పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆర్థిక భరోసానిస్తున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నిరుపేద కుటుంబాలలో కల్యాణకాంతులు విరజిల్లుతున్నాయని ప్రశంసించారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.