బడంగ్‌పేట, ఆగస్టు 10 : ముంపు సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చాలా కాలనీలు ముంపు భారీన పడ్డ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించారు. వరద కాల్వలలో పేరుక పోయిన చెత్తా చెదారాన్ని ఎందుకు తొలగించడం లేదని అగ్రహాం వ్యక్తం చేశారు. చెత్తను లొలగించక పోవడంతో సమస్య జఠిలం అయిందన్నారు.
నాలాలో చెత్త పేరుక పోతే వరద నీళ్లు ఎలా పోతాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకోకుండా సమస్య పరిష్కారం అయేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులోకి వదర నీరు రాకుండా ఎస్ఎన్డీపీ అధికారులు అడ్డంగా గోడ కట్టడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
వరద నీరు చెరువులోకి పోయే విధంగా చేయకుండా భయటకు పంపించడం టప్ల ఆమె ఎస్ఎన్డీపీ అధికారులపై మండి పడ్డారు. వరద నేరుగా కాలనీలోకి వస్తుందని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వివరించారు. రాత్రి నుంచి ముంపులోనే ఉన్నామని కాలనీ వాసులు వాపోయారు. కమిషనర్ వాణిదేవి, అడిషనల్ కమిషనర్, డిఈ, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎస్ఎన్డీపీ నాలాను ఆమె పరిశీలించారు. చెరువులోకి వరద రాకుండా కట్టిన మద్యన గోడను తొలగించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
నిర్మాణాలను తొలగించండి
వరద కాల్వలకు అడ్డంగా ఎవరు నిర్మాణాలు చేపట్టినా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెడ్డి బ్యాటరీ దగ్గర వరద నాలాను అక్రమించి కడుతున్న నిర్మాణాన్ని ఆపాలని అధికారులకు ఆదేశాలు జారిచేశారు. నింబంధనలకు విరుద్దంగా కట్టడాలు మిటని అధికారులను పశ్నించారు. నాలాలలో ఉన్న చెత్తను తొలగించి ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ నాగేందర్ రెడ్డి, డీఈ వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి, జలాల్ పూర్ సునితా బాల్ రాజ్, అశోక్, శ్రీనివాస్ గుప్త, మాదారి రమేష్ తదితరులు ఉన్నారు.