బీజేపీ మాయలో పడోద్దు..కాంగ్రెస్‌ను నమ్మొద్దు
పదేండ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని.. ఎన్నికల్లో ప్రజలను ఆరు గ్యారెంటీలంటూ మభ్యపెట్టి.. ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను మరోసారి నమ్మి మోసపోకూడదని.. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సూచించారు.
- పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
- ఆరు గ్యారెంటీల్లో ఒక్క హామీనీ కాంగ్రెస్ నెరవేరలేదు
- ప్రజలు మరోసారి మోసపోవద్దు
- మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
- తాండూరు, పూడూరు మండలాల్లో ప్రజా ఆశీర్వాద సభ.. ధారూరు లో కార్యకర్తల సమావేశం
- పాల్గొన్న బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, తాండూరు, పరిగి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, ఆనంద్
తాండూరు/పూడూరు/ధారూరు, మే 2 : పదేండ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని.. ఎన్నికల్లో ప్రజలను ఆరు గ్యారెంటీలంటూ మభ్యపెట్టి.. ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను మరోసారి నమ్మి మోసపోకూడదని.. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సూచించారు. గురువారం తాండూరు సమీపంలోని లక్ష్మీనారాయణపూర్ దగ్గర పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా యాలాల, బషీరాబాద్ మండలాల బీఆర్ఎస్ ఆశీర్వాద సభ..పూడూరు మండలంలోని మన్నెగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ.. ధారూరు మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె.. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, తాండూరు, వికారాబాద్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, ఆనంద్, మహేశ్రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలన తెలంగాణలో స్వర్ణ యుగమన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని వసతులతోపాటు రాష్ర్టాభివృద్ధికి బీఆర్ఎస్ కృషి చేసిందన్నారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించి పార్టీలు మారిన వారికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఈ ప్రాంత ప్రజలకు తెలియని రంజిత్‌రెడ్డిని కేసీఆర్ పిలుపు మేరకు ఎంపీగా గెలిపించామని.. రెండుసార్లు బీఆర్ఎస్ ‘కారు’ గుర్తుపై గెలిచిన వారు ఇప్పుడు మనకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారని..వారికి ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. రంజిత్‌రెడ్డికి కేసీఆర్, కేటీఆర్ ఎంతో ప్రాధాన్యమిచ్చారని.. చేవెళ్ల టికె ట్ కేటాయించిన తర్వాత కేసీఆర్‌ను మోసం చేసి ఆయన కాంగ్రెస్‌లో చేరారని మం డిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి చేవెళ్ల అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌కు భారీ మెజా ర్టీతో గెలిపించాలని సబితారెడ్డి సూచించారు. ఆయన జడ్పీచైర్మన్‌గా రంగారెడ్డి జిల్లా అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. బీఆర్ఎస్ పాలనే బాగున్నదని వారు గ్రహించారన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 12 సీట్లు వచ్చే అవకాశమున్నదని తెలియడంతో కాంగ్రెస్, బీజేపీల్లో భయం పట్టుకున్నదన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పని చేయాలని సూచించారు. మాజీ మంత్రి సబితారెడ్డి, మహేశ్‌రెడ్డి సమక్షంలో సిరిగాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో సహా 15 మంది బీఆర్ఎస్లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్, చేవెళ్ల ఎన్నికల ఇన్చార్జి రాంబాబు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజూగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీశైల్‌రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, రాంచందర్, రాష్ట్ర నాయకుడు అనిల్‌రెడ్డి, యాలాల, బషీరాబాద్, ధారూరు మండలాల అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, వెంకటయ్య, రామ న్న, వినోద్, వేణుగోపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్, రాములు సత్యనారాయణరెడ్డి, అంజ య్య, లక్ష్మయ్య, సుధాకర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, దేవేందర్, వెంకటయ్య, విజయ్ కుమార్, యాత్రగౌడ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల గడ్డ.. బీఆర్ అడ్డా..
-మెతుకు ఆనంద్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే
కాసాని గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డిపై నమ్మకం పోయింది. ఆరు గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశాడు. ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చలేదు. విద్యుత్తు, తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ఎవరు అధికారంలో ఉంటే మంచి జరుగుతుందో ప్రజలు గుర్తించారు. చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయం. వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలి.
పార్టీలకతీతంగా కృషి చేయాలి
-నాగేందర్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు
బీసీలందరూ పార్టీలకతీతంగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు కృషి చేయాలి. ఆయన బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. బీసీ బిడ్డను గెలిపించి బీసీల ఆత్మగౌరవాన్ని చాటాలి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలి.
అన్ని వర్గాలకు అండగా ఉంటా : కాసాని జ్ఞానేశ్వర్, బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి
పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తా. అన్ని వర్గాలకు అండగా ఉంటా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావాసులతో మంచి సంబంధాలు న్నాయి. గతంలో జడ్పీచైర్మన్‌గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశా. బీఆర్ఎస్ హయాం లోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఐదు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, విద్యుత్తు సమస్యలు మొదలయ్యాయి.
కాసానిని గెలిపించుకుందా..
– మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే
కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు అందరం ఐక్యంగా కృషి చేద్దాం. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. దాదాపు ఐదు నెలలు దాటినా ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ప్రజలను మోసం చేసిన రేవంత్ ప్రభుత్వానికి ఓటు ద్వారా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. పార్లమెంట్లో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉన్నది. అందువల్ల అందరం కలిసి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
కాంగ్రెస్‌తో అన్నీ కష్టాలే..
-రోహిత్‌రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలంటూ ముంచిన రేవంత్‌రెడ్డికి ఎంపీ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలి. బడేబాయ్.. ఛోటేబాయ్ని నమ్మితే అన్యాయమే. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు, రైతులకు మంచి జరిగితే కాంగ్రెస్ పాలనలో అన్ని కష్టాలే మొదలయ్యా యి. పార్టీలోనే ఉంటూ వికారాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలను ఓడించేందుకు కుట్ర పన్నిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ సునీతారెడ్డికి సరైన గుణపాఠం చెబుతాం. వారు ఎక్కడ నిలబడ్డా రిటర్న్ గిఫ్టు కచ్చితంగా ఇస్తాం.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అన్ని వర్గాలకు ఆప్తుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. అందుకు తాండూరు నుంచి లక్షకు పైగా ఓట్ల మెజార్టీ ఇద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా నైతికంగా మనమే గెలిచాం. తాండూరు బిడ్డగా ఊపిరి ఉన్నంత వరకూ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తా. బీఆర్ఎస్ పార్టీ మారేది లేదు.. కాంగ్రెస్, బీజేపీకి ఎదురుగా నిలబడుతా.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

