దోమ, ఫిబ్రవరి 18 : గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. దోమ మండల కేంద్రంతో పాటు ఉదన్‌రావుపల్లి, లింగన్‌పల్లి, అయినాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.35లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను శనివారం రాత్రి జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని వీధుల్లో సీసీ రోడ్లను వేసి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు అనిత, విజయాగోపాల్గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేశ్‌గౌడ్, విజయ్‌కుమార్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, యాదయ్యగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యాలాల, పిబ్రవరి18: మండల కేంద్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి ముంజూరైన రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆదివారం పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కోఆప్షన్ జిల్లా అధ్యక్షుడు అక్బర్ బాబా కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సంప్రదించగా వెంటనే నిధులను మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.