శంషాబాద్ రూరల్, ఆగస్టు 29 : బహుజన విప్లవ వీరుడు సర్వాయ్ పాపన్నగౌడని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయ్ పాపన్నగౌడ్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన విప్లవ వీరుడు సర్వాయ్ పాపన్నగౌడ్ని వివరించారు. అనగారిన వర్గాలు, బహుజనల ఐక్యత కోసం పోరాడి గోల్కొండ కోటను జయించిన ధీరుడని కొనియాడారు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన పేదలు, బడుగు బలహినవర్గాల కోసం పని చేశారని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని గ్రామాలలో ఐక్యత చాటని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తన్విరాజు, చంద్రారెడ్డి,వెంకటేశ్‌గౌడ్,మాజీ సర్పంచ్‌లు దండుఇస్తారి, రమేష్‌యాదవ్,నాయకులు రవీందర్‌గౌడ్,శ్రీకాంత్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, మైలారంభిక్షపతి,ఎస్ శ్రీనివాస్, గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు నారాయణగౌడ్, ఉపాధ్యాక్షుడు జనార్ధన్‌గౌడ్, కార్యదర్శి విఠలయ్యగౌడ్, లింగంగౌడ్, రామస్వామిగౌడ్, శ్రీరాములు, జగదీష్‌గౌడ్, లక్ష్మయ్య, సిద్దేశ్వర్లతో పాటు పలువురు పాల్గొన్నారు.