అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
కొడంగల్‌లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018కి ముందు కొడంగల్ పట్టణ పరిస్థితి ఏవిధంగా ఉంది.
- ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్, నవంబర్ 4: కొడంగల్‌లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018కి ముందు కొడంగల్ పట్టణ పరిస్థితి ఏవిధంగా ఉంది.. ప్రస్తుతం ఏ విధంగా ఉంది గమనించాలని కోరారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో రూ.50కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. ఎంత వరకు సద్వినియోగం చేసుకున్నారో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గృహలక్ష్మి పథకం కింద అసలైన లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా అభి వృద్ధికి సహకరించే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఎంఐఎం నాయకుడు ఎస్బీ గుల్షన్ కలిసి బీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూద న్‌రావు యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు రమేశ్‌బాబుతో పాటు నాయకులు నవాజొద్దీన్, రమేశ్‌బాబు, జగన్ పాల్గొన్నారు.
ప్రచారంలో భాగంగా వృద్ధులను ప్రత్యేకంగా కలిసి కేసీఆర్ సార్ అందిస్తున్న పింఛన్ వస్తుందా.. పింఛన్ రాకముందు ఎట్లుండే, పింఛన్ వచ్చాక ఎట్లుందని పలకరిం చారు. అవ్వ నవ్వుతూ.. పెన్షన్ వస్తుంది బిడ్డా.. కేసీఆర్ సార్ సల్లంగ ఉండాలె.. మళ్లీ ఆ సార్ సర్కారే రావాలె అని దీవించింది. సార్ ఇస్తున్న పైసలతో మంచిగా బతుకుతున్న అని సం తోషాన్ని వ్యక్తం చేసింది. మహిళలను ఎమ్మెల్యే కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ప్రోత్సహాన్ని వివరిస్తూ.. బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.
చేతి వృత్తుల వారిని ఎమ్మెల్యే కలిసి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను వివరించారు. ప్రభుత్వం చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయాన్ని అందించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మె ల్యే తెలిపారు. చేతి వృత్తులకు పూర్వ వైభవం సంతరించుకోవాలంటే కేసీఆర్ సార్‌తోనే సాధ్యపడుతుందని తెలిపారు. సార్ సాయంతో నే మళ్లీ పనులు చేపట్టుకొంటున్నామని, గతంలో ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల చేతి వృత్తుల పనుల కనుమరుగైయ్యాయని వారు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

