BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో కీలకమైన పర్యనటకు సిద్ధమవుతోంది టీమిండియా. రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 4వ తేదీన శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. తొలి టెస్టుకు ముందు శుభ్‌మన్ గిల్ (Shubman Gill)సేన నాలుగు రోజులు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే.. అనుకోని కారణాల వల్ల షెడ్యూల్ మారింది. నాలుగు రోజుల కాస్త మూడు రోజులకు మారింది. ఇందుకు కారణం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.
శ్రీలంక పర్యటనకు భారత స్క్వాడ్ ప్రకటన సమయంలోనే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అయితే.. ఇప్పుడు షెడ్యూల్లో మార్పులు చేశామని, ప్రాక్టీస్ మ్యాచ్ మూడు రోజులకే పరిమితం కానుందని సమాచారం. షెడ్యూల్ ఎందుకు మారింది? అనేది మాత్రం తెలియడం లేదు. శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతం గంభీర్ బృందం ఆగస్టు 4న శ్రీలంకకు వెళ్లనుంది. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం తొలి టెస్టుకోసం భారత జట్టు గాలే చేరుకోనుంది.
🚨India tour of Sri Lanka update🚨
The upcoming practice match for Team India against a local Sri Lankan XI, set to commence on August 7, will now be conducted as a three-day affair instead of the originally planned four-day fixture🏏 pic.twitter.com/nb28xYR3NT
— CricInformer (@CricInformer) August 1, 2026
ఆగస్టు 15 వ తేదీన గాలే స్టేడియంలో మొదటి టెస్టు.. ఆపై ఆగస్టు 23న కొలంబోలో రెండో టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో ఉన్న గిల్ సేన.. ఈ రెండు మ్యాచుల్లో గెలిచినా టాప్-2లోకి వచ్చే అవకాశాలు తక్కువే. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఫిట్నెస్ పరీక్షలో పాసవ్వడం భారత పేస్ బలాన్ని పెంచనుంది. అయితే.. గాయం నుంచి కోలుకుంటున్న సాయి సుదర్శన్ ఈ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
భారత టెస్టు స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవ్‌దత్ పడిక్కల్, సరాన్ష్ జైన్.