మేమంతా బీఆర్ఎస్ వెంటే..
అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని బిచ్చాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
- దౌల్తాబాద్ మండలం బిచ్చాల్ గ్రామంలో హస్తం వీడి 120 మంది గులాబీ గూటికి
- కోస్గి మండలం గుండుమాల్‌లో కారెక్కిన 300 మంది ప్రతిపక్షాల నాయకులు
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొడంగల్, షాద్‌నగర్, వికారాబాద్, తాండూరు ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, మెతుకు ఆనంద్, పంజుగుల రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్, అక్టోబరు 28 : అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని బిచ్చాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు 120మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించి ఆత్మీయంగా పలకరించారు.
అనంతరం ఎమ్మెల్యే పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో కొడంగల్ నియోజవకర్గ అభివృద్ధికి రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేయడంతో ప్రతి గ్రామానికి రోడ్డు, తాగునీరు తదితర ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ నారాయణపేట జిల్లా చైర్మన్ శ్యాసం రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, భగవంతుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గుండుమాల్‌లో కాంగ్రెస్ ఖతం
కోస్గి : కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పా ర్టీ రోజు రోజుకూ కనుమరుగైపోతున్నది. గుండుమాల్ మండలంలో 300మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు గుడిసె ఫకీరప్ప, వెంకటప్ప, దస్తప్ప, పెద్ద ఆశప్ప, లక్ష్మి, చిన్నప్ప, గోవిందమ్మ, రాయు లు, శ్రీను, శాంతప్ప, ఆశమ్మ అంజిలయ్య, దస్త ప్ప, కేశవులు, ఎర్ర జంగయ్య, చిన్న జంగయ్య, రవి, అనిత, కేశవులు, హన్మంతు, ఎల్లమ్మ, వెంకటేశ్, కిష్టయ్య, రంగయ్య, చిన్నమ్మ, చిన్నప్ప, ల క్ష్మి, దడ పెంటప్ప,
ఈశమ్మ, పద్మమ్మ, రాములు, కృష్ణయ్య, సుజాత, బండ్ల రాజు, మోహన్ చారి, సూరి, అంజయ్య, కృష్ణ, దడ శ్రీను, ఆశప్ప, సా యమ్మ , మంగమ్మ, సాయిలు, పవన్, జముల మ్మ, వెంకటమ్మ, అంజిలమ్మ కాశప్ప తదితరులు పార్టీలో చేరారు. వారికి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ నారాయణపేట జిల్లా చైర్మన్ శ్యాసం రామకృష్ణ, జడ్పీటీసీ ప్రకాశ్ రెడ్డి, ఎంపీపీ మధుకర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండ ల అధ్యక్షుడు హన్మంతు రెడ్డి, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలి
బొంరాస్‌పేట : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో కా ర్యకర్తలు, నాయకుల చేరికలు కొనసాగుతున్నా యి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు గులాబీ గూటి కి చేరుతున్నారు. శనివారం మండలంలోని మదన్పల్లితండాకు చెందిన చందూలాల్, రాజూనాయక్, సీతారాం, దాంలా నాయక్, అమీన్బా బు, బలరాం, శీను, లాలు, చందూలాల్, నరేశ్, జయరాం, శీను, అనిల్ తదితరులు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

