తుర్కయంజాల్,ఆగస్టు 16 : ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బస్తీ దవాఖానాలను ప్రారంభించామని తెలిపారు.
బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నయని ఎమ్మెల్యే కిషన్రెడ్డి తెలిపారు. ప్రజలు కార్పోరేట్ దవాఖానల చుట్టూ తిరుగుతూ డబ్బును వృథ చేసుకోకుండా బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధారెడ్డి, వైస్ చైర్పర్సన్ హరిత, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కోశికె అయిలయ్య, డిప్యూటి డీఎంహెచ్ఓ నాగజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.