యాచారం, నవంబర్10: బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలోని నందీశ్వర క్షేత్రంలో శుక్రవారం పూజలు చేశారు. నియోజకవర్గంలోని నందివనపర్తి నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కిషన్‌రెడ్డి ప్రచారానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
నాయకులు, కార్యకర్తలు ఆయనకు గజమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. నందివనపర్తి, చౌదర్పల్లి, ధర్మన్నగూడ, తులేఖుర్దు, నజ్దిక్‌సింగారం గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతులకు కన్నీళ్లే మిగులనున్నాయన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలు ముమ్మాటికీ సాధ్యం కావని, ప్రజలను మోసం చేసేందుకే ఈ పథకాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ది చెప్పాలన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రూ.400లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య బీమా రూ.15లక్షలకు పెంపు, సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి, రైతుబంధు రూ.16వేలకు పెంపుతో సకల జనులకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
నందివనపర్తిలో రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఐదేండ్లకోసారి ప్రజల ముందుకు వచ్చే మల్రెడ్డి మాటలకు మోసపోవద్దన్నారు. నామినేషన్ల రోజే అరాచకానికి ఒడి గట్టిన మల్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గుండాలు దాడులకు పాల్పడినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీల మాటలను ప్రజలను నమ్మే స్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తానన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఉదయశ్రీ, సబిత, అరుణమ్మ, నర్సిరెడ్డి, ఎంపీటీసీలు రజిత, రవికిరణ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్ఛభాష, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రాజునాయక్, మల్లేశ్, యాదయ్యగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, జిల్లా రాములు, లక్ష్మీపతిగౌడ్, శ్రీశైలం, యాదయ్య, పాండురంగారెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, ఖాజు, శంకర్‌గౌడ్, రాజశేఖర్‌రెడ్డి, సుధాకర్, గోపాల్, వెంకటేశ్, రమేశ్, ఈశ్వర్, దానయ్య, మహేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.