ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 11 : రైతు సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించటంలో ఏఈవోల పాత్ర ఎంతో కీలకమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఏఈవోల సంఘం నూతన సంవత్సరం డైరీని నగరంలోని ఆయన నివాసంలో ఏఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాలాల శ్రవణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఏఈవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.