మంచాల, జనవరి 12 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో మొదటగా రెండు హామీలను అమలు చేయడమే కాకుండా వంద రోజుల్లో మిగతా హామీలను కూడా పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. శుక్రవారం మంచాల మండలంలోని బోడకొండ, చెన్నారెడ్డిగూడ గ్రామాల్లో రూ. 93లక్షలతో సీసీరోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం చీదేడు, ఎల్లమ్మతండా, బోడకొండ, ఆరుట్ల గ్రామాల్లో వీఆర్‌వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ఫిల్టర్ను ఆయన ప్రారంభించారు.
ముందుగా మంచాలలో చాకలి ఐలమ్మ జాపాలలో జ్యోతిరావు ఫూలే విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో భాగంగా గ్రామాల్లోకి వచ్చిన అధికారుల వద్ద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయనున్నట్లు చెప్పారు. గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోని వారు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని చెప్పారు. ముందుగా వివిధ గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు ఎమ్మెల్యే రంగారెడ్డిని సన్మానించారు.
వివిధ గ్రామాలకు చెందిన 37మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంచాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మల్రెడ్డి రంగారెడ్డి లభ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోతు నర్మద, జడ్పీటీసీ నిత్య, సర్పంచ్‌లు రమాకాంత్‌రెడ్డి, పద్మ, కిషన్‌నాయక్, కొంగర విష్ణువర్దన్‌రెడ్డి, జగన్‌రెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్, సుకన్య, నరేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ కేవీవీ ప్రసాద్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్, డీఈ అబ్బాస్, మాజీ ఎంపీపీ గుండమోని జయమ్మ, వీఆర్‌వన్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
యాచారం : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలాంటివని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. పట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి. తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.