చర్లపల్లి, మార్చి 3 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy) పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని వీఎన్‌రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్ని కాలనీ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీఎన్‌రెడ్డినగర్‌లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కాలనీలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరామిరెడ్డి, కనకరాజుగౌడ్, గౌరవ అధ్యక్షుడు సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి రామచంద్రం, ఉపాధ్యాక్షులు వాసుదేవారెడ్డి, వీరయ్య, రంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులు హనుమంత్‌రెడ్డి, బాల్‌రాజు, బుచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శులు రాజేందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, నగేశ్, రాజశేఖర్‌రెడ్డి, సలహాదారులు తిరుపతయ్యగుప్తా, సూర్య భగవాన్, లక్ష్మణ్‌చారి, లక్ష్మణ్‌సింగ్, వరప్రసాద్ల పాల్గొన్నారు.