Chegunta | చేగుంట : ఆధ్యాత్మిక కేంద్రంగా కర్నాల్‌పల్లి షిర్డీసాయిబాబా దేవాలయం విరాజిల్లుతోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చేగుంట మండల పరిధిలోని కర్నాల్‌పల్లి భక్తాంజనేయ, షిర్డీ సాయిబాబా దేవాలయ తొలి వార్షిక వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వాహకుడు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో సోమవారం గణపతిపూజ, స్వస్తివాచనం, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ట, మహాలింగార్చన, మంగళహారతి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెలే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కర్నాల్‌పల్లి షిర్డీ సాయిబాబా దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని.. భక్తుల కొంగుబంగారంగా మారిందని చెప్పారు. ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు చేస్తున్న కృషి ఎనలేనిదని, ప్రతి భక్తుడు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు అంజనేయులు, ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేశ్‌గుప్తా, యెర్వ బాల్‌రెడ్డి, కాడిగిద్ద యాదరెడ్డి, తుమ్మ యాదగిరి, వంటరి రాంరెడ్డి, ఇమ్మడి లక్ష్మన్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్‌రెడ్డి, అన్నదాన కమిటీ చైర్మన్ కేఆర్ మధు సూదన్‌రెడ్డి, కొత్త నాగలింగం, వంటరి శ్రీనివాస్‌రెడ్డి, అంజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, సుభాష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మంచికట్ల శ్రీనివాస్, నాయిని రాజ్‌గోపాల్, వంటరి అశోక్‌రెడ్డి, ఎర్ర యాదగిరి, డిష్ రాజు, అన్నం రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.