శంకర్పల్లి, నవంబర్ 5: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని మోకిలా, మోకిలా తండాల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీల మాయ మాటలు ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని, గతంలో పలుమార్లు అధికారం ఇస్తే చేయలేని పనులు ఇప్పుడు ఏలా చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ బద్ధం శశిధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, మాజీ చైర్మన్ రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్‌కన్నా, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తూరు : బీఆర్ఎస్ గెలిస్తేనే కొత్తూరు ప్రగతికి మలుపు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో ఆదివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్‌యాదవ్ మాట్లాడుతూ కొత్తూరు మున్సిపాలిటీ ప్రగతి పథంలో ప్రయనించాలంటే ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తిరిగి గెలువాలన్నారు. మరి కొన్ని రోజుల్లో కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి చిరునామాగా మారుతుందని చెప్పారు. అంజయ్యయాదవ్ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కొత్తూరు మున్సిపాలిటీకి అధిక నిధులు తెచ్చామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాసులు, బీఆర్ఎస్ నాయకులు జనార్దనాచారి, బ్యాగరి యాదయ్య, గోవింద్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, భిక్షపతి, ఆంజనేయులు, శ్రీశైలం, బండారి రామకృష్ణ, కుమ్మరి వెంకటేశ్, పాల్గొన్నారు.
కొత్తూరు మండలంలోని గూడూరు, మల్లాపూర్ తండా, తీగాపూర్, సిద్ధాపూర్ గ్రామాల్లో నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ బ్యాగరి సత్తయ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు గుండు సురేశ్, పాల్గొన్నారు. మల్లాపూర్ తండాల్లో మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్‌నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ పథకాలను ప్రజలకు వివరించారు.
శంకర్పల్లి : నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసిన నాయకుడు కాలె యాదయ్యకు మరోసారి పట్టం కట్టాలని నవాబ్‌పేట జడ్పీటీసీ జయమ్మ(ఎమ్మెల్యే సతీమణి) అన్నారు. మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డి నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. ఎమ్మెల్యే యాదయ్య సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ అందేలా కృషి చేశారన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ఎన్కేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, జడ్పీటీసీ కాలె యాదయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. అజీజ్‌నగర్ గ్రామంలో సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ సుజాత ఆధ్వర్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. అభ్యర్థి కాలె యాదయ్యను అత్యథిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శ్రీహరియాదవ్, ఎంపీటీసీ రితీశ్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కుమ్మరి రాము, ఏఎంసీ వైస్ చైర్మన్ దారెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు సుధాకర్‌యాదవ్, బాల్‌రాజ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు ప్రమీల, ఎన్కేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు పెండ్యాల శ్రీనివాస్, వార్డు సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ల కుమార్ పాల్గొన్నారు.