చేవెళ్ల రూరల్, నవంబర్ 11 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం చీకటి అవుతుందని, మళ్లీ పాతరోజులే వస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శనివారం ఉదయం 8 గంటలకు చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామంలో సర్పంచ్ విజయలక్ష్మీనర్సింహులు, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్‌తో కలిసి ఇంటింటికీ తిరిగి చేసిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మండల పరిధిలోని బస్తేపూర్లో సర్పంచ్ నర్సింహులు, మీర్జాగూడ సర్పంచ్ భీమయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ సమన్యాయం చేసిందన్నారు.
సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు ప్రజలకు కనీస అవసరాలను తీర్చే పరిస్థితి కూడా ఆలోచించలేదని, అలాంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మొద్దని, తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, ఆలూర్ ఎంపీటీసీ యాదమ్మపోచయ్య, ఆలూర్ ఉప సర్పంచ్ కసిరె వెంకటేశ్, నాయకులు మాణిక్యరెడ్డి, రాములు, శివారెడ్డి, శివనీల చింటు, శేఖర్, రవీందర్‌రెడ్డి, రవికాంత్‌రెడ్డి, రామాగౌడ్, నాగార్జురెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : మరింత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే యాదయ్యను మరోసారి గెలిపించాలని చేవెళ్ల పీఎసీఎస్ డైరెక్టర్ నత్తి కృష్ణా రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మల్లేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు హ్యాట్రిక్ విజయం అందించి అభివృద్ధికి బాటలు వేద్దామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కొత్తూరు మున్సిపాలిటీలో నూతన కార్యాలయం ఏర్పాటు చేసుకొని సుపరిపాలనకు పునాది వేశామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మాదారం నర్సింహాగౌడ్, సోమ్లానాయక్, జె. శ్రీనివాసులు, బీఆర్ఎస్ నాయకులు గోవింద్‌రెడ్డి, బండి కృష్ణ, బాలరాజు, విష్ణుమూర్తి, జె. శివ, బండి శ్రవణ్, రాజుయాదవ్, రవియాదవ్, గణేశ్‌యాదవ్, కుమార్, శ్రీను పాల్గొన్నారు.
మొయినాబాద్ : కుల,మతాల మధ్య చిచ్చు పెట్టే కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే కొంప ముంచుతారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్‌రెడ్డి అన్నారు. క్లస్టర్-4 ఇన్చార్జి ఎంఏ రవూఫ్, క్లస్టర్ -1 ఇన్చార్జి జయవంత్ ఆధ్వర్యంలో వెంకటాపూర్, మేడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి కాలె యాదయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వెంకటాపూర్ సర్పంచ్ మనోజ్‌కుమార్, మేడిపల్లి ఎంపీటీసీ అంజయ్య, చిన్నమంగళారం ఎంపీటీసీ మల్లేశ్, మాజీ సర్పంచ్‌లు సుధాకర్‌యాదవ్, శ్రీహరియాదవ్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బిలాల్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దారెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్, ఉపాధ్యక్షుడు బాల్‌రాజ్, ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్‌గౌడ్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు సుభాష్ పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్ మండలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుంది. శనివారం మండలంలోని బోడంపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్, చేవెళ్ల ఎమ్మెల్యేగా కాలె యాదయ్య భారీ మెజార్టీతో గెలుపోందడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో బోడంపహాడ్ సర్పంచ్ గంగాపురం కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గూడూరు సరళ, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కారు చెన్నయ్య, పార్టీ నాయకులు రాంచంద్రారెడ్డి, యాదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ కోటా లక్ష్మి, యూత్ కార్యదర్శి నరేశ్, ఇనాయత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నందిగామ, నవంబర్ 11 : బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ అన్నారు. నందిగామ మండలం రంగాపూర్, చాకలిగుట్టతండా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు ప్రజలలో ఆదరణ లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులను ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఆ ప్రయత్నాలను కార్యకర్తలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్‌లు రమేశ్‌గౌడ్, రాజూనాయక్, గోవిందు అశోక్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, బీఆర్ఎస్ నాయకులు హనుమాంత్రావు, తోట భాస్కర్, గబ్రు చౌహాన్, గణేశ్, చంద్రశేఖర్, కిషన్‌నాయక్, విజయ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.