తలకొండపల్లి : ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, పాఠశాలకు ప్రహరీ నిర్మాణం, సీసీరోడ్ల నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారు సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు సాగాలన్నారు. నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా మాడ్గుల మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులు ఇస్తున్నదని అన్నారు.
గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని అ న్నారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మారెడ్డి, సర్పంచ్ పద్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు రమేశ్‌రెడ్డి, జంగయ్య, నాయకులు కృష్ణారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి, యాదయ్య, శ్రీశైలం, యాదగిరి, రమేశ్, శ్రీనివాసులు, కృష్ణ, మల్లేశ్, రాములు, వెంకటయ్య, జంగయ్య, నర్సింహ పాల్గొన్నారు.