వికారాబాద్, జూన్ 20 : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి విద్యార్థీ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని రాష్ట్ర శాసనసభాపతి, వికారాబా ద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం లక్ష్మీబాయి బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు అల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రైవేట్ బడులకు దీటుగా సర్కారు పాఠశాల లను బలోపేతం చేస్తుందన్నారు. బాలికలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
బాలికల రక్షణకోసం కాంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో మౌలిక వసతు లు, దవాఖానలను ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ముం దుండేలా చూస్తామన్నారు. ఏడాదిలో రెండుసార్లు నులిపురుగుల నివారణ మా త్రలు వేస్తారని.. జిల్లాలో 1-19 వయసున్న చిన్నారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రా ల్లోని పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. మాత్రలు తీసుకొని వారికి తిరిగి ఈ నెల 27న కచ్చితంగా ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ విద్యార్థినులు శ్రద్ధ, క్రమశిక్షణతో చదువుకోవాల న్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు స్పీచ్ ఇవ్వగా ఉపాధ్యాయులు, స్టూడెంట్స్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ పాల్వన్కుమా ర్, పాఠశాల ప్రిన్సిపాల్ రమణమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ : విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని..తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం జాతీ య నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు మాత్రలు, యూనిఫాంలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ పాల్వన్‌కుమార్, డీఈవో రేణుకాదేవి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రవీంద్రయాదవ్, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, తహసీల్దార్ విజయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉషారాణి, ఎంఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.
బడంగ్‌పేట : నులి పురుగుల నివారణకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. గురువారం మహేశ్వరం మండలంలో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ఆమె హాజరయ్యారు. అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు అల్బెండజోల్ మా త్రలు వేశారు. నివారణకు తీసుకోవాల్సిన అంశాలతో ఏర్పాటు చేసిన పోస్టర్ణు ఆవిష్కరించారు.