అభివృద్ధిని గెలిపించండి
అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ఆ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని ధన్నారం, వెంకటపూర్తండా, రాజీవ్‌నగర్ కాలనీ, ఆలంపల్లి, శివరాంనగర్, న్యూగంజ్ కాలనీల్లో పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
- వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్, నవంబర్ 26 : అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ఆ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని ధన్నారం, వెంకటపూర్తండా, రాజీవ్‌నగర్ కాలనీ, ఆలంపల్లి, శివరాంనగర్, న్యూగంజ్ కాలనీల్లో పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు రూ.5లక్షల బీమా పథకం ధీమాగా ఉందన్నారు.
రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. రైతు బంధు ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చేది, రాబోయే రోజుల్లో ఎకరానికి రూ.16వేలు చేయబో తున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం వారు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. స్థానికుడైన తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. డిగ్రీ కళాశాల, మెడికల్ కళాశాల, బ్రిడ్జి నిర్మాణానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.
ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికి ఒకే విడతలో దళితబంధు పథకం అమలు చేస్తానని చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ నెల 30 వ తేదీన జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మునిస్పల్ మాజీ చైర్పర్సన్, కౌన్సిలర్ పుష్పలతారెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, రాములు, రాజలక్ష్మీ, గోపాల్, రామస్వామి, నవీన్‌కుమార్, కిరణ్ పటేల్, పావని, గాయత్రీలక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ హఫీజ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్టీసెల్ పట్టణ అధ్యక్షులు బాబు, నాయకులు, అనీల్, షఫీ, నర్సింహులు, సిరాజ్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

