సంగారెడ్డి, జూన్1: గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యే ప్రభాకర్‌ను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌ను కేసీఆర్ అభినందించారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకుడు శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.