కాప్రా, ఫిబ్రవరి 26 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్ పరిధి శ్రీ సాయి ఎంక్లేవ్ కాలనీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యల గురంచి కాలనీ వాసులను ఎమ్మల్యే అడిగి తెలుసుకున్నారు.
ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బైరి నవీన్ గౌడ్, ఎంకే బద్రుద్దీన్, మల్లారెడ్డి, గణేష్, కాశీనాథ్, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కిరణ్, రమేష్, సుధీర్, రవికాంత్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.