నందిగామ, ఏప్రిల్ 3 : సంక్షేమ పథకాల అమల్లో రా ష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని షాద్‌నగర్ ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం మం డలంలోని మామిడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నోముల పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోని ఏరాష్ట్రంలోనూ లేని విధం గా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంతోపాటు రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసి ప్రతి గుంటకూ సాగునీరు అందిస్తామని, ప్ర జలు తమ భూములను అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు.
విద్యావైద్య రంగాలకు పెద్దపీట..
ప్రభుత్వం విద్యావైద్యం రంగాలకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే అన్నారు. విద్యరంగంలో అనేక మార్పులు తీసుకొస్తూ గురుకులాలు, మాడల్, కేజీబీవి పాఠశాల ల ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతాయన్నారు. ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అం దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని.. ఆయన నాయ కత్వంలో రాష్ట్రం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రతిపక్ష పార్టీలను నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని అందువల్ల రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీలు రవీందర్‌యాదవ్, ప్రియాంకగౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మంజులారెడ్డి, అశోక్, రాజగోపాల్, మాజీ చైర్మన్ విఠల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్‌నాయక్, ఎంపీటీసీ లత, సర్పంచ్‌లు చంద్రారెడ్డి, కవి త, అశోక్, కుమార్, స్వామి, సంతోష, నీలమ్మ, ఎల్లమ్మ, రమేశ్‌గౌడ్, రాజ్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకు లు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుం చి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిక..
మామిడిపల్లి, మొదళ్లగూడ, శ్రీనివాసులగూడ గ్రామాల కు చెందిన పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బాల్‌రెడ్డి, పెంటయ్య, రఘుపతిరెడ్డి, రాంచంద్రారెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, దామోదర్, రాంచంద్రయ్య, షఫి, బాబయ్య, యాదయ్య, పోచమ్మ, నర్సింహ తదితరులున్నారు.