షాద్‌నగర్, నవంబర్13 :కాంగ్రెస్ పాలనలో మనకు జరిగిన అన్యాయాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను నమ్మితే గోస పడక తప్పదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం, సోమవారాల్లో చౌదరిగూడ మండలంలోని రావిర్యాల, కాస్లాబాద్, పీర్జాపూర్, ఇంద్రానగర్, గుర్రంపల్లి, గాలిగూడ, ధర్మ్యా తండా, చేగిరెడ్డి ఘనపూర్, వీరన్నపేట, పెద్ద ఎల్కిచర్ల, తూంపల్లి, పద్మారం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉండేవో మనందరికి తెలుసని, కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకని దుర్భర స్థితిలో పల్లెలు ఉండేవని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా ? అనే విషయాన్ని గమనించాలని, ఏనాడైన పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకుందా ? అని ప్రశ్నించారు. కేవలం మతాల పేరుతో, కులాల పేరుతో రాజకీయాలు చేసి, స్కామ్‌లు చేసి ప్రజాధనాన్ని లూటీచేసి రాష్ర్టాన్ని దోచుకున్నారే తప్పా , మన కోసం ఆలోచించారా ? అనే విషయాన్ని ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. బతుకమ్మలతో గ్రామీణ మహిళలు స్వాగతం పలుకుతూ బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో దామోదర్‌రెడ్డి, బంగారు రాములు , ఆఫీజ్, కృష్ణ, రాంబాల్‌నాయక్, మంగులాల్‌నాయక్, బాబురావు, నర్సింగరావు, ముస్తాఫా, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
జోరందుకున్న ఎన్నికల ప్రచారం
కేశంపేట : ఎన్నికల గడువు దగ్గరపడుతుండటంతో గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. కేశంపేట మండలంలోని 29 గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్‌కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మూడోసారి అధికారంలోకి వస్తే జరుగబోయే కొత్త ఫథకాలు, నిరుపేదలకు జరిగే లాభాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ ప్రచారంలో సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోనమోని రమేశ్‌యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్క అవినాశ్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, సింగప్పగూడెం నర్సింహులు, కృష్ణ, గోపాల్, అంజిరెడ్డి, జయంత్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. ప్రతి గ్రామం గులాబీమయంగా మారడంతో నాయకులు మరింత జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మండలంలోని హాజిపల్లి,లింగారెడ్డిగూడ గ్రామాల్లో ఆయా గ్రామ సర్పంచ్‌లు మౌనిక, మాధవి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోలోని అంశాలను గడపగడపకూ వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాష్ర్టంలో అమలవుతున్న సంక్షేమ ఫథకాలు అందని గడపలేదన్నారు. అంజన్నను మరోసారి గెలిపిస్తే మన నియోజకవర్గం మరింత అభివృద్ది చెందుతుందన్నారు.
చేవెళ్లటౌన్ : కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. మరో మారు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఓటర్లను అభ్యర్థించినట్లు మల్లారెడ్డి గూడ సర్పంచ్ మహాన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణా రెడ్డి, శేరి పెంటారెడ్డి ఓటర్లను కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాధిక, నాయకులు మాధవ రెడ్డి, శ్రీకాంత్, మల్లేశ్, మహేందర్, రాంచంద్రయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, దర్శన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : బీఆర్ఎస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణతో ప్రతిపక్ష పార్టీలకు నిద్ర పట్టడం లేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తోలుకట్టా గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు జయవంత్,బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రవూఫ్, మాజీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, తోలుకట్టా సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రవీందర్, మాజీ సర్పంచ్ శ్రీహరియాదవ్, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్, ఉపసర్పంచ్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు : అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, కౌన్సిలర్ మాదారం నర్సింహాగౌడ్, బీర్ఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసులు, శివకుమార్, గోవిందర్రెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.