షాద్‌నగర్, మే 20 : తెలంగాణ ప్రభుత్వంలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని సర్కారు దవాఖాన ఆవరణలో ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సుమారు రూ. 60 లక్షల వ్యయంతో డయాలసిస్ వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ముత్రపిండాల సమస్యలు ఉన్న రోగులకు డయాలసిస్ అవసరపడుతుందని, ఈ వైద్యాన్ని పొందేందుకు వేల రూపాయల ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. రోగికి వైద్య ఖర్చు భారం కావద్దనే షాద్‌నగర్ పట్టణంలో ఉచిత డయాలసిస్ వైద్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణలో కేవలం మూడు మాత్రమే ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, నేడు 83 డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు కానుగు బచ్చలి నర్సింహ, ఈగ వెంకట్రాంరెడ్డి, కానుగు అంతయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వైద్యాధికారులు డాక్టర్. జయలక్ష్మి, డాక్టర్. శ్రీనివాస్, నాయకులు చెట్ల నర్సింహ, పిల్లి శేఖర్, మేకల వెంకటేశ్ పాల్గొన్నారు.
రూ. 80 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు
పాత జాతీయ రహదారి ఆధునీకరణలో భాగంగా రూ. 80 లక్షలతో సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. శనివారం లైటింగ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాద్‌నగర్ చౌరస్తా నుంచి వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే చౌరస్తా నుంచి సోలీపూర్ బైపాస్ వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతాయని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లు సర్వర్‌పాషా, ఈగ వెంకట్రాంరెడ్డి, అంతయ్య, శ్రీనివాస్, నాయకులు శంకర్, నర్సింహ, వెంకటేశ్, దామోదర్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో బస్తీబాట
షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 17, 19, 20, 21వ వార్డులో సాయంత్రం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బస్తీ బాట నిర్వహించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు మేలు
కొత్తూరు : సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు మేలు కలుగుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని కొడిచెర్లకు చెందిన సేనావత్ రామ్‌సింగ్ నాయక్‌కు రూ. 31 వేలు, కొర్ర సుజాతకు రూ. 12 వేలు, దీంతోపాటు కొడిచెర్ల తండాకు చెందిన కొర్ర గొన్యానాయక్కు రూ. 24 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సంతోష్‌నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, నాయకులు పెంటనోళ్ల యాదగిరి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బిచ్చానాయక్, దేశాల జైపాల్, దేశాల రమేశ్, ఉప సర్పంచ్ అమృత మోహన్‌నాయక్, జంగయ్య పాల్గొన్నారు.