సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయం
సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
- కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం
- మిషన్ భగీరథ రాష్ట్ర వైస్‌చైర్మన్ ఉప్పల వెంకటేశ్
- జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా చంద్రధనలో ప్రచారం
తలకొండపల్లి, అక్టోబర్ 27 : సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పందేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని సూచించారు. ఇంటింటా ఏదో ఒక పథకంతో ప్రజలు లబ్ధి పొందారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.
రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యు త్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లతోపాటు దేశంలో 450కి పైగా పథకాలను అమలు చేస్తున్న ఎకైక ప్రభుత్వం బీఆర్ఎస్సేనని, అందుకే ప్రజలందరూ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని, ఎమ్మెల్యేగా జైపాల్‌యాదవ్‌ను గెలిపించి కల్వకుర్తిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నిర్మల, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రహమాన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచులు గోపాల్‌నాయక్, చంద్రయ్య, లక్ష్మణ్‌నాయక్, నాయకులు గంజి శ్రీనివాసులు, రాములు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జంగయ్యగౌడ్, రాఘవేందర్‌గౌడ్, శ్రీశైలంయాదవ్, శేఖర్, మల్లేశ్, శ్యాంసుందర్‌రెడ్డి, జహంగీర్, బక్కి వెంకటేశ్, నర్సింహ, రాము, ఆంజనేయులు, వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మరు
కడ్తాల్, అక్టోబర్ 27 : కాంగ్రెస్ పార్టీ నా యకులు ప్రకటిస్తున్న మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని జెడ్పీటీసీ దశరథ్‌నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని అన్మాస్‌పల్లి, మైసిగండి, గాన్గుమార్ల తండా గ్రామ పంచాయతీల్లో, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 161, 162, 163, 164 బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి కల్వకుర్తిలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేద్దాని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం గా బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. కార్యకర్తలు ప్రతి ఓటరుని కలిసి ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు.
60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని, సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలెవ్వరూ నమ్మే స్థితిలో లేరన్నారు. పేదల వ్యతిరేక పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునే సీఎం కేసీఆర్‌కి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ తులసీరాంనాయక్, ఉప సర్పంచులు శారద, పాండునాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, పీఏసీసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, మాజీ ఎంపీటీసీ సక్రి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు రవినాయక్, మహేశ్‌యాదవ్, పాండు, వార్డు సభ్యులు రాజేశ్‌గౌడ్, పత్యానాయక్, శంకర్, నాయకులు హర్యానాయక్, పంత్యా, సోమ్లా, శంకర్, శ్రీరాములుగౌడ్, అమ్రు, రామస్వామిగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, మూరా, గోపాల్, కృష్ణయ్యయాదవ్, మహేశ్, రమేశ్, బ్రహ్మ, శంకర్, చంద్రు, గిరి, సక్రు, శ్రీను, ప్ర శాంత్, రాజు, విష్ణు, రామకృష్ణ పాల్గొన్నారు.
జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం
ఆమనగల్లు, అక్టోబర్ 27 : కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీలోని ముర్తుజపల్లి, చంద్రాయాన్పల్లితండాలో శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మొదటగా ముర్తుజపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ మ్యూనిపెస్టో తెలియజేస్తూ ఓట్లును అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మూడో సారి కేసీఆర్ సీఎం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయలన్నారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్దే అన్నారు. స్వరాష్ట్రంలో పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ,సాగు, తాగు నీటితో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, ముర్తుజపల్లి కౌన్సిలర్ విక్రం, బీఆర్ఎస్ నాయకులు వీరయ్య, జహంగీర్, సతీశ్, వడ్డేమోని శివ, హనీఫ్, అఫ్సర్, తోట కృష్ణ, కంబాలపల్లి అల్లాజీ, మైసయ్య, వెంకటయ్య, సైదులు, గణేశ్, యాదయ్య, రాములు, ఆనం ద్, మహేశ్, కార్తిక్, శేఖర్, కృష్ణ, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

