మంచాల, డిసెంబర్ 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంతో గిరిజనుల దశాబ్దాల నాటి తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తండాల్లోని మహిళలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడ్డారు. ప్రతిరోజూ వ్యవసాయ బావులు, చెలమలు, దోనల్లోని నీటిని తెచ్చుకునే వారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత మారుమూల తండాలకు కూడా స్వచ్ఛమైన నీటిని అందించాలని సంకల్పించారు. మిషన్ భగీరథ పథకాన్ని తండాలు, గ్రామాల్లోనూ అమలు చేయడంతో ప్రజల తాగునీటి కష్టాలన్నీ తీరాయి. మండలంలోని కొర్రవానితండా, పటేల్చెర్వుతండా, ఆంబోతుతండా, సత్తితండా, బుగ్గతండా, సలిగుట్టతండా, గుట్టకిందితండా, ఎల్లమ్మతండా, బోడకొండ, లోయపల్లి, ముచ్చర్లకుంట తండాల్లో తాగునీటి అవస్థలు తొలగిపోయాయి.
దశాబ్దాలుగా ఈ తండాల్లోని గిరిజనులు తాగునీటి కోసం పడరాని పాట్లు పడ్డారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి కోసం గిరిజన మహిళలు ప్రతిరోజూ వ్యవసాయ బావులు, చెలమలకు పరుగు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ ప్రతిరోజూ శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్నది. మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో ఉదయం ఆరుగంటలు అయ్యిందంటే చాలు తండాలతోపాటు అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటిని అధికారులు సరఫరా చేస్తుండడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుతో..
సీఎం కేసీఆర్ ఐదు వందల జనాభా కలిగిన ప్రతి గిరిజన తండానూ గ్రామ పంచాయతీగా మార్చడంతో తండాల రూపురేఖలు ఎంతో మారిపోయాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలు ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకుంటూ ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. మండలంలోని ఆంబోత్తం డా, కొర్రవానితండా, సత్యంతండా, పటేల్చెర్వు తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు పల్లెప్రగతి కార్యక్రమం కింద ప్రతినెలా నిధులను కేటాయిస్తున్నది. ఆ నిధులను తండాల సర్పంచ్లు సద్వినియోగం చేసుకుంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నారు.
మండలంలో పలు గిరిజన తండాలకు ప్రతిరోజూ లక్షల లీటర్ల చొప్పున మిషన్ భగీరథ నీటిని అధికారులు ఉదయం 6 నుంచి 8గంటల వరకు న ల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం ఈ పంపిణీ జరుగుతున్నది. గిరిజన తండాల్లో జనాభాకు అనుగుణంగా ఐహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, సంపులు, ప్రత్యేక పైపులైన్లను నిర్మించారు.
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచే భగీరథ తాగునీరు ఇంటింటికీ సరఫరా అవుతున్నది. ఊరంతా పైపులైన్లు వేసి, ఇంటింటికీ నల్లాల కనెక్షన్లు ఇచ్చారు. దశాబ్దాలుగా పడుతున్న తాగునీటి అవస్థలు తీరాయి. నీటి గోస తీర్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. -మెగావత్ మోతీ
తండాలకు మంచి రోజులొచ్చాయి
తండాలకు మంచి రోజులు వచ్చాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో దశాబ్దాల పాటు నీటి కోసం వ్యవసాయ బావులు, చెలమల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. సీఎం కేసీ ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగు నీటి ఇబ్బందులు పరిష్కరించేం దుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి మమ్మల్ని ఆదు కుంటున్నారు. ఇప్పుడు ప్రతిరోజూ పుష్కలంగా నీరు వస్తున్నది. గిరిజన మహిళలం ఆనందంగా ఉన్నాం.
-మెగావత్ పీరీ, ఆంబోతుతండా
తండాల్లో తీరిన నీటి ఇబ్బందులు
మిషన్ భగీరథతో తండాల్లో తాగునీటి కష్టాలు తీరాయి. కొన్నేండ్లు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఉదయమే ఇంటింటికీ తాగునీరు వస్తున్నది. ‘మిషన్ భగీరథ’తో తాగునీటి కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్కు తండాల్లోని గిరిజనుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
-లక్ష్మి, కొర్రవాని తండా సర్పంచ్
గ్రామాల్లో నీటి కష్టాలు లేవు
మిషన్ భగీరథ పథకంలో గ్రామాలు, గిరిజన తండాల్లోని ప్రజల తాగునీటి కష్టాలు తొలిగిపోయాయి. ప్రతిరోజూ ఉదయమే ప్రతి ఇం టికీ తాగునీరు సరఫరా అవుతున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
-నర్మద, ఎంపీపీ
మహిళలు ఆనందంగా ఉన్నారు
గతంలో ఎండాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులకు గురయ్యేది. ప్రతిరోజూ ఉదయమే లేచి వ్యవసాయ బావులు, చెలమల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. బిందెడు నీరు కూడా దొరికేది కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇం టింటికీ తాగునీరు వస్తున్నది. గ్రా మాలు, తండాల్లోని మహిళలు ఎంతో ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. -పద్మ, ఎల్లమ్మతండా సర్పంచ్
సీఎంకు ప్రజలు రుణపడి ఉంటారు
గతంలో వేసవి వచ్చిందంటే మూడు నెలలపాటు నీటి కోసం వ్యవసాయ బావులు, చెలమలకు ఉదయమే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకురావడంతో ఇంటింటికీ నల్లాల ద్వా రా తాగునీరు అందుతున్నది. కోట్లాది రూపాయలతో పైపులైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు నీటిని అందిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలందరూ రుణపడి ఉంటారు.
-పెంట్యానాయక్, సత్తితండా సర్పంచ్