శంకర్పల్లి మండలం, ప్రొద్దటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పారులో శుక్రవారం ప్రపంచ సుందరాంగులు సందడి చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్’ పోటీ ల్లో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు ప్రొద్దటూరులో 250 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పారులోని అరుదైన మొకలు, వృక్ష జాతులు, శిల్పకళ సంపదను వీక్షించారు. అందమైన ఆకృతుల వద్ద ఫొటోలు దిగి.. సెల్ఫీలు తీసుకున్నారు. పారు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.
-చేవెళ్ల రూరల్, మే 16