దోమ, డిసెంబర్ 22 : డాక్టర్ బీఆర్ అం బేద్కర్‌ను రాజ్యసభలో అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అంబేద్కర్, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో అంబేద్కర్, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు సరి కాదన్నా రు.
అంబేద్కర్‌ను కించపరిచేలా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్‌ను అవమానిస్తే దేశం సహించబోదన్నారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మతోన్మాద మంత్రికి బుద్ధి ప్రసాదించాలని వారు ఎద్దేవా చేశారు. దేశానికి దిశా నిర్దేశం చేసిన అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, మైనారిటీ నాయకులు బాబర్, షేర్‌ఖాన్, తెలంగాణ ఉద్యమకారుడు రామన్న మాదిగ, జంగయ్య, శ్రీకాంత్, నర్సింహులు, రియాజ్, ఫెరోజ్, విజయ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు