వికారాబాద్, జనవరి 8 : ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను వేగవంతంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరాఫరాల శాఖ అధికారులతో ప్రజాపాలన దరఖాస్తుల నమోదు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వానకాలం.
యాసంగి సీజన్లపై మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతీకుమారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానకాలం, యాసంగి 2022-23 ఏడాదికి సంబంధించి మిల్లర్లు మిల్లింగ్ కెపాసిటీ ప్రకారం లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు.