మహేశ్వరం, సెప్టెంబర్ 13 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సబితాఇంద్రారెడికే పూర్తి మద్దతు ఉంటుందని గట్టుపల్లి గ్రామస్తులు ముక్తకంఠంతో వెల్లడించారు. ఈ మేరకు వారు బుధవారం మంత్రి నివాసంలో ఆమెను కలిసి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. అత్యధిక నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే ఎన్నో ఏండ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.
మంత్రి సబితారెడ్డి గట్టుపల్లి గ్రామాభివద్ధికి రూ.25 కోట్లను వెచ్చించారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఏ కష్టమొచ్చినా నేనున్నాననే ధైర్యం మంత్రి సబితారెడ్డి తమకు ఇస్తున్నదని, ఆమె వెంటే ఉంటామని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. మంత్రిని కలిసినవారిలో సర్పంచ్ అనితాప్రభాకర్రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకరయ్య, మాజీ సర్పంచ్ రాకేశ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సౌడయ్య, నియోజకవర్గం కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్ నాయకులు శ్రీశైలం, ఎండీ సాదత్, కృష్ణనాయక్, వెంకటేశ్, శ్రీశైలం, ఆంజనేయులు, ఎర్రస్వామి, చంద్రశేఖర్, రాజు, గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.