సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణలో కరెంట్ కష్టాలు తీరాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కందుకూరులో జరిగిన విద్యుత్ ప్రగతి సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమైక్యరాష్ట్రంలో విద్యుత్ కోతలతో కంపెనీలు సరిగా నడవక మూతపడేవన్నారు. నేడు పరిశ్రమలు, వ్యవసాయం, గృహాలకూ 24 గంటలపాటు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దశాబ్ది సంబురాలు అంబరాన్నంటాయి. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన విద్యుత్ విజయోత్సవ ర్యాలీలు, సభల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్‌లో కళాకారుల నృత్యాలు అలరించాయి.
ఇబ్రహీంపట్నం, జూన్ 5 : సీఎం కేసీఆర్ కృషి వల్లే నేడు రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందుతున్నదని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కందుకూరులో జరిగిన విద్యుత్తు ప్రగతిసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు .. ప్రస్తుత విద్యుత్తు పరిస్థితులను ప్రజాప్రతినిధులు, రైతులకు వివరించారు. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు ఎంతో గోస పడేవారని, అన్న దాతలే చందాలు వేసుకుని లారీల్లో మరమ్మతులకు తీసుకెళ్లే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
దొంగరాత్రి వచ్చే కరెంట్‌తో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. విద్యుత్తు సరఫరా సరిగ్గాకాక కంపెనీలు, పరిశ్రమలు మూతపడి.. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరెం ట్ కష్టాలకు చెక్ పడిందన్నారు. రైతుల కు 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుండటంతో తెలంగాణ ధా న్యగారంగా మారిందన్నారు. ప్రస్తు తం విద్యుత్తు సరఫరాతో కంపెనీలు, పరిశ్రమలు తమ ఉత్పత్తులను నిరాటంకంగా కొనసాగిస్తూ.. ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు. వివిధ దేశాలకు చెందిన పెద్ద, పెద్ద కంపెనీలు తమ బ్రాంచీలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయన్నారు.
Rr11
సీఎం కేసీఆర్ ఓ విజన్‌తో ముందుకెళ్తున్నారని కొనియాడారు. విద్యుత్తు సమస్య పరిష్కారానికి నూతన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, తీగలను ఏర్పాటు చేశారని ఇందుకు రూ.312 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గతంలో 1,200 యూనిట్లు వినియోగిస్తే.. ప్రసుత్తం 2,126 యూనిట్లకు పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తు అందుతున్నదన్నారు. కుల వృత్తుల వారిని ఆదుకునేందుకు ఎస్సీలు ఆరు లక్షల మందికి, ఎస్టీలు మూ డు లక్షల మందికి వందయూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును.. అదేవిధంగా నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకులకు లాండ్రీలు, ఇస్త్రీ కోసం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సర్కారు అందిస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని గ్రామాల్లోని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అనంత రం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.