కందుకూరు, నవంబర్ 20 : రంగారెడ్డి-పాలమూ రు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరానికీ సాగునీటితోపాటు తాగునీటిని కూడా అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని సరస్వతీగూడ, అగర్మియగూడ, తిమ్మాపూరు, జబ్బార్‌గూడ, బేగంపేట్, రాచులూరు, బైరాగిగూడ, కొత్తూరు తదితర గ్రామాల్లో ఆమె రోడ్ షో నిర్వహించి మా ట్లాడారు. అంజన్న ఆలయం లేని ఊరు లేదని.. ప్రభుత్వ పథకం అందని గడప లేదని స్పష్టం చేశా రు. తాను స్థానికురాలిని కాదని బీజేపీ నాయకులు అంటున్నారని.. మరి మీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్థానికుడా అని ప్రశ్నించారు. ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నాడన్నారు. సీఎ కేసీఆర్‌కు కందుకూరు అంటే అమితమైన ప్రేమ ఉందన్నారు.
తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ముచ్చర్ల గేటు వరకు మెట్రోతోపాటు మెడికల్ కళాశాల, 450 పడకల దవాఖానను తీసుకొస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆ పార్టీ నాయకు లు అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అమ్ముతారని ఆరోపించారు. కరోనా వస్తే సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వా రిని ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని.. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30న కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుండేలా తీర్చిదిద్దుతానన్నారు.
కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి. మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, ఈశ్వర్‌గౌడ్, మండలాధ్యక్షుడు జయేందర్‌ముదిరాజ్, మేఘనాథ్‌రెడ్డి, పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మాదేవేందర్, మాజీ ఎంపీపీ శోభాఈశ్వర్గౌడ్, సాయిలు, కవితాకరుణాకర్రెడ్డి, అంజయ్యగౌడ్, బాల్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి, సర్పంచ్‌లు రాము, భూపాల్‌రెడ్డి, పరంజ్యోతి, గోపాల్‌రెడ్డి, గోవర్ధన్, శ్రీనివాసాచారి, రామకృష్ణారెడ్డి, నరేందర్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, నర్సింహ, శ్రీరాములు, రవికాంత్‌రెడ్డి, సదానంద్‌గౌడ్, సామయ్య, ఆనంద్, దేవీలాల్, కార్త్తిక్, దీక్షిత్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, శేఖర్‌గుప్తా, శివశంకర్, రవి ముదిరాజ్, రాంరెడ్డి, శ్రీను నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపు రం కిషన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూరు గ్రామంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, మంత్రి సబితారెడ్డికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు, పురుషు లు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుక మ్మ ఆడడంతోపాటు మంత్రిపై పూలవర్షం కురిపించి పటాకులు కాలుస్తూ మంత్రికి ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని అన్ని వీధుల్లో కలియదిరిగారు. కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు సూచించారు.